Encounter: ఛత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌ఘడ్‌లోని దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతాలైన భైరంగాడ్ పోలీస్ స్టేషన్, దంతెవాడ పోలీస్ స్టేషన్ పరిధి అటవీ ప్రాంతాల్లో పోలీసులు, మావోయిస్టుల భీకరంగా ఎదురు కాల్పులు జరిగాయి.

Update: 2024-09-03 07:57 GMT

దిశ, భద్రాచలం: ఛత్తీస్‌ఘడ్‌లోని దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతాలైన భైరంగాడ్ పోలీస్ స్టేషన్, దంతెవాడ పోలీస్ స్టేషన్ పరిధి అటవీ ప్రాంతాల్లో పోలీసులు, మావోయిస్టుల భీకరంగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ ఫైర్‌లో దాదాపు 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. అనంతరం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు భారీగా పేలుడు పదార్ధాలు, అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.


Similar News