BREAKING: ఆర్ఎస్ఐని అంటూ ఘరానా మోసం.. కట్ చేస్తే.. కటకటాల పాలు

తాను పోలీస్ అంటూ చలమణి అవుతోన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన ఘటన శ్రీశైలం దేవస్థాన పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2024-09-05 07:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: తాను పోలీస్ అంటూ చలమణి అవుతోన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన ఘటన శ్రీశైలం దేవస్థాన పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్‌కు చెందిన కుసుమ శ్రీకాంత్ ఆర్ఎస్ఐ పేరుతో వీఐపీ దర్శనం కోసం రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే దేవాలయ అధికారులు, శ్రీశైలం పోలీసులు ఆయన అభ్యర్థనను పరిశీలించి ఈ నెల1న ప్రశాంత్‌కు స్వామి వారి దర్శనంతో పాటు వసతి ఏర్పాట్లు సైతం చేశారు. అయితే, ప్రశాంత్ తీరుపై అనుమానం కలిగి విచారణ చేపట్టిన శ్రీశైలం పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అతడు నిజమైన పోలీసు కాదని.. ఓ నకిలీ ఆర్ఎస్ఐ‌గా గుర్తించారు. ఈ మేరకు నిందితుడు ప్రశాంత్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. కాగా, అతడిపై ఇప్పటికే ఘట్‌కేసర్ పరిధిలో చాలా కేసులు ఉన్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది.      


Similar News