గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం..
కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద అలుగు వరద తాకిడికి
దిశ, కూసుమంచి: కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద అలుగు వరద తాకిడికి కొట్టుకుపోయిన యాకుబ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆదివారం వరద ప్రవాహంలో ముగ్గురు గల్లంతు కాగా షరీఫ్ ను పోలీసులు రక్షించిన విషయం తెలిసిందే. ఇద్దరు గల్లంతు కాగా షరీఫ్ తండ్రి యాకుబ్ మృతదేహం లభ్యమైంది.అలుగు నుంచి 200 మీటర్ల దూరంలో బయటపడిన మృతదేహన్ని స్థానికుల సహాయంతో పోలీసులు బయటకు తీశారు. మరోకరి కోసం పోలీసులు,అధికార యంత్రాంగం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.