అంగట్లో ఆడబిడ్డ.. ఖరీదు @ రూ. 4.50 లక్షలు

3 నెలల పసికందును అమ్ముతున్న ముఠాని పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Update: 2024-05-22 08:16 GMT

దిశ, మేడిపల్లి : 3 నెలల పసికందును అమ్మకానికి పెట్టిన ఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలో సంచలనం రేపింది.  పోలీసులు చిన్నారిని అమ్ముతున్న ముఠాని అరెస్ట్ చేశారు. కొందరు మహిళలు, వీరు ఆడబిడ్డలే అన్నది మరిచారో ఏమో సభ్యసమాజం తల దించుకునేలా అంగట్లో ఆడబిడ్డను అమ్మకానికి బేరం పెట్టారు. ఓ స్వచ్చంద సంస్థ ద్వారా వీరి గుట్టు రట్టు అయింది. అక్షర జ్యోతి ఫౌండేషన్‌కి చెందిన మహిళలు తమకు ఆడిపిల్ల కావాలని స్ట్రింగ్ ఆపరేషన్ చేశారు. వీరికి మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిరామకృష్ణ నగర్‌లో శోభా రాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌లో ఆర్ ఎం పీ వైద్యురాలు శోభా రాణి ఈ పని చేస్తుందని ఆమెని సంప్రదించగా, అమ్మాయిని రూ. 4.50 లక్షలకు ఇప్పిస్తానని ఫోన్ ద్వారా చెప్పడంతో ముందుగా రూ. 10 వేలు అడ్వాన్స్‌గా చెల్లించారు.

బుధవారం పాపకోసం వారు క్లినిక్‌కు రాగా వేరే మహిళ అక్కడకు ఓ పాపతో వచ్చి వీరికి అప్పగించారు. దీంతో సంస్థ మహిళలు పోలీసులకు, మీడియా‌కు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా, పోలీసులు చేరుకొని వీరందరిని పోలీస్ స్టేషన్‌కు  విచారణ కోసం తరలించారు. పేద కుటుంబం పిల్లలను పోషించడం భారమణి తల్లి చెప్పడంతో అమ్మాయిని పిల్లలు లేనివారికి అమ్మినట్లు శోభరాణి చెప్పడం కొసమెరుపు. శోభారాణి ఇంకా కొన్ని హాస్పిటల్ పేర్లు, చిలకనగర్‌లో మరో మహిళా ఆర్‌ఏంపీ, మ్యారేజ్ బ్యూరోలో పనిచేసే మహిళల పేర్లను చెప్పినట్లు సమాచారం. వీరంతా కలిసి  చిన్నారి విక్రయానికి ప్లాన్ చేసినట్లు తెలిసింది. 


Similar News