బాయ్ ఫ్రెండ్‌తో కలిసి సినిమాకు వెళ్లిన యువతి.. ఒక్కసారిగా కత్తితో దాడి
తిరుపతి జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఓ సినిమా థియేటర్లో కత్తిపోట్ల ఘటన కలకలం రేపుతోంది.
దిశ,వెబ్‌డెస్క్:తిరుపతి జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఓ సినిమా థియేటర్లో కత్తిపోట్ల ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే..ప్రకాశం జిల్లా గిద్దలూరు గ్రామానికి చెందిన లోకేష్ అనే యువకుడు ఈ రోజు(శనివారం) తన స్నేహితులతో కలిసి సినిమా చూసేందుకు థియేటర్(Theater )కు వచ్చాడు. అదే సమయంలో సూళ్లూరుపేటకు చెందిన కార్తీక్, యువతి కావ్య కూడా థియేటర్‌కు వచ్చారు. కార్తీక్ అనే యువకుడు లోకేష్‌తో వాగ్వాదానికి దిగి కత్తితో పొడిచాడు. అనంతరం యువతి కావ్యతో కలిసి పారిపోయాడు. దీంతో ప్రేమ వ్యవహారమే కత్తిపోట్లకు దారి తీసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనకు సంబంధించి యువతి పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ MBU విద్యార్థి లోకేష్‌ను రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.