హైదర్‌గూడలో కారు బీభత్సం.. పట్టుకొని చితకబాదిన వాహనదారులు

హైదరాబాద్‌‌లోని హైదర్‌గూడలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

Update: 2024-09-04 13:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌‌లోని హైదర్‌గూడలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు వాహనదారులకు గాయాలు అయ్యాయి. స్థానికులు అప్రమత్తమై.. సదరు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అంనతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News