వివాహేతర సంబంధం.. తర్వాత ఏం జరిగిందంటే..?
వరుసకు సోదరితో వివాహేతర సంబంధం హత్యకు దారి తీసింది.
దిశ, మంచిర్యాల : ఓ వివాహేతర సంబంధం హత్యకు దారి తీసింది. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో నివసిస్తున్న మల్యాల నరేష్ ఓ యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై పలు సందర్భాల్లో పంచాయతీలు కూడా అయ్యాయి. తాను ఈ వ్యవహారం మానుకుంటానని ఊరు విడిచి వెళ్లిపోతానని చెప్పిన నరేష్ వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడు. తిరిగి ఇక్కడికి వచ్చిన నరేష్ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుండటంతో ఆ యువతి సోదరుడు మంగళవారం రాత్రి మల్యాల నరేష్‌ను ఆటోతో గుద్ది, బండతో మోదీ చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.