7740 కేజీల నల్ల బెల్లం స్వాధీనం
ఇతర రాష్ట్రాల నుంచి అధికమొత్తంలో నల్లబెల్లాన్ని తీసుకొచ్చి బేగంబజారు, అత్తాపూర్ పరిసర ప్రాంతాల్లో అనుమతి లేని గోదాల్లో నిల్వ చేస్తూ గుట్టచప్పుడు కాకుండా అమ్మకాలు సాగిస్తున్న ముఠాను ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ అరెస్ట్ చేసింది.
దిశ, జూబ్లిహిల్స్ : ఇతర రాష్ట్రాల నుంచి అధికమొత్తంలో నల్లబెల్లాన్ని తీసుకొచ్చి బేగంబజారు, అత్తాపూర్ పరిసర ప్రాంతాల్లో అనుమతి లేని గోదాల్లో నిల్వ చేస్తూ గుట్టచప్పుడు కాకుండా అమ్మకాలు సాగిస్తున్న ముఠాను ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ అరెస్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే...అంబోతు బాలకోటి, గన్‌శ్యామ్ దాస్ ఇద్దరూ నల్లగొండ జిల్లా దిండి ప్రాంతం నుండి నల్లబెల్లాన్ని తీసుకు వెళ్లడానికి ఒక కారు తీసుకొని వచ్చారు. వీరిద్దరూ ఎక్సైజ్ పోలీసుల్ని చూసి పారిపోగా ఆ కారులో నల్ల బెల్లాన్ని గోదాం నుంచి లోడ్ చేస్తున్న తరుణంలో ఎన్ ఫోర్స్‌మెంట్ సీఐ బి.చంద్రశేఖర్,
ఎస్సై చల్లా రవి సిబ్బంది కలిసి గోదాంలో తనిఖీ చేశారు. అందులో భారీగా నల్ల బెల్లం నిల్వలు ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. నల్ల బెల్లం గోదాంను నిర్వహిస్తున్న అంబోతు బాలకోటి, కారులో ఉన్న 420 కిలోల బెల్లాన్ని ఎన్ ఫోర్స్‌మెంట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 7.50 లక్షల విలువగల 7,740 కిలోల నల్ల బెల్లం, 40 కేజీల అల్లం, రెండు లీటర్ల నాటుసారా, కారును స్వాధీనం చేసుకొని అంబోతు బాలకోటి, గన్‌శ్యామ్ దాస్ మరో వ్యక్తి పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నల్ల బెల్లాన్ని పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ టీం ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమల హసన్ రెడ్డి అభినందించారు.