వివాహం కావట్లేదని ఆ యువకుడు ఏం చేశాడో తెలిస్తే షాక్

మండలంలోని వెంచరామి గ్రామానికి చెందిన తోట లక్ష్మణ్ (28) తనకు వివాహం కావట్లేదని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Update: 2025-04-08 14:32 GMT
వివాహం కావట్లేదని ఆ యువకుడు ఏం చేశాడో తెలిస్తే షాక్
  • whatsapp icon

దిశ, చిట్యాల : మండలంలోని వెంచరామి గ్రామానికి చెందిన తోట లక్ష్మణ్ (28) తనకు వివాహం కావట్లేదని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మణ్ అమ్మానాన్నలు మృతి చెందడంతో అదే గ్రామంలో ఉన్న చిన్నమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈ నెల 5వ తేదీన తనకంటే చిన్నవాళ్ళకు పెళ్లిళ్లు అవుతున్నాయని, నాకు కావడం లేదని బాధపడుతూ, మద్యం తాగుతూ రాత్రి సమయంలో మద్యం మత్తులో ఇంట్లో గల గుర్తు తెలియని పురుగుల మందు తాగాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు చిట్యాల ఆసుపత్రికి తీసుకువచ్చి, మెరుగైన చికిత్స కోసం ఎంజీఎంకు తీసుకెళ్లగా సోమవారం రాత్రి చనిపోయాడని, మృతుని చిన్నమ్మ కూతురైన తోట లక్ష్మి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Similar News