ముగ్గురు మగాళ్లతో మహిళ రాసలీలలు.. సిగరెట్, మందు తాగుతూ ‘ఆయన’కు చుక్కలు చూపిస్తూ..

ప్రస్తుత సమాజంలో మగాళ్లే కాదు.. చాలామంది మహిళలు కూడా మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

Update: 2023-07-05 10:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత సమాజంలో మగాళ్లే కాదు.. చాలామంది మహిళలు కూడా మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. లేదా భర్త ఉండగానే ఇతర వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. కొంతమంది అయితే కేవలం డబ్బు కోసమే మగాళ్లకు వల వేసి ప్రేమ, పెళ్లి అంటూ దగ్గరవుతున్నారు. తర్వాత అందినకాడికి నొక్కేసి పరారవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అన్నపూర్ణ కాలనీకి చెందిన రేవంత్ అనే వ్యక్తి పాన్ షాప్ నిర్వహిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న అతడు.. రెండో పెళ్లి చేసుకునేందుకు ఓ మ్యారేజ్ యాప్‌ను ఆశ్రయించాడు. దాంట్లో వరంగల్ జిల్లాకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ఇష్టంగా మారి యువతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అయితే తనకు ఇదే మొదటి వివాహమని యువతి తెలిపింది. తర్వాత ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఎన్టీపీసీలోని చిలుకలయ్య ఆలయంలో వీరి పెళ్లి జరిగింది. పెళ్లైన కొన్ని రోజులకే యువతి అసలు రంగు బయటపడింది. సిగరెట్లు, మందు కావాలంటూ భర్తను వేధించేది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.

అయితే.. ఇటీవల తన అక్క ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి రూ.70 వేల నగదు, 4 తులాల బంగారంతో వెళ్లిన యువతి ఎంతకూ తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన రేవంత్.. ఆమె గురించి ఎంక్వైరీ మొదలు పెట్టాడు. అంతే.. అమ్మడు బండారం మొత్తం బయటపడింది. ఆమెకు గతంలో మూడు పెళ్లిళ్లు అయ్యాయని, చాలా మందితో ఎఫైర్లు ఉన్నట్లు తెలుసుకుని షాక్‌కు గురయ్యాడు. చివరకు ఆమె ఎక్కడుందో తెలుసుకుని వెళ్లే సరికి అక్కడ భార్య.. స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ మందు సిగరెట్‌తో దర్శనమిచ్చింది. భర్తను చూసిన భార్య కూడా ఒక్కసారిగా షాకై అక్కడ ఉన్నవారితో అతడిపై దాడి చేయించి వీడియోలు తీసింది. అంతేకాకుండా తన విషయం బయటపెడితే ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించింది. ఇక డబ్బు కోసం రేవంత్‌ని, అతడి కుటుంబ సభ్యులను వేధించడంతో తట్టుకోలేకపోయిన భర్త.. న్యాయం చేయమని ఎన్టీపీసీ పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News