54 ఏళ్ల పాఠశాల ప్యూన్..5వ తరగతి విద్యార్థినికి మత్తు మందు ఇచ్చి ఏం చేశాడంటే.?

ఘజియాబాద్‌లో నివసించే ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌కు చెందిన అజయ్ కుమార్ (54)గత పదేళ్లుగా ఢిల్లీలో ఘాజీపూర్‌లోని మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో ప్యూన్‌గా పనిచేస్తున్నాడు.

Update: 2023-03-24 07:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఘజియాబాద్‌లో నివసించే ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌కు చెందిన అజయ్ కుమార్ (54)గత పదేళ్లుగా ఢిల్లీలో ఘాజీపూర్‌లోని మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో ప్యూన్‌గా పనిచేస్తున్నాడు. అటెండర్ అతని సహచరులు ముగ్గురు కలిసి.. అదే పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న బాలికను గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆ చిన్నారికి మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి బాలిక బడికి వెళ్లడం మానేసింది. అలాగే ఫైనల్ ఎగ్జామ్స్ కూడా రాయకపోవడంతో క్లాస్ టీచర్ ఆ బాలిక సోదరుడిని పాఠశాలకి ఎందుకు రావడం లేదని ఆరా తీయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై ఫిర్యాదు చేసేందుకు పాఠశాలకు రావాలని పాఠశాల ప్రిన్సిపాల్ బాలిక తల్లిదండ్రులను ఫోన్ చేయగా, వారు పాఠశాలకు వచ్చి ఫిర్యాదు చేయడానికి ఇష్టపడలేదు. ‘తర్వాత పాఠశాల ప్రిన్సిపాల్ తన తోటి ఉపాధ్యాయులు కలిసి సంఘటన గురించి జోనల్ అధికారులకు తెలియజేశారు.

సంఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ఒక మహిళా ఇన్స్పెక్టర్‌తో పాటు ఇద్దరు స్కూల్ ఇన్స్పెక్టర్లతో కూడిన కమిటీ ఈ విషయంపై విచారణ జరిపింది. ఈ విషయం గురించి ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) నగర పోలీసులకు, ఎంసీడీకి నోటీసులు జారీ చేసింది. పోలీసులు బాధితురాలిని లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి కౌన్సెలింగ్ ఇచ్చారు. నిందితుడి వివరాల ఆధారంగా తక్షణమే సస్పెండ్ చేశారని ఎంసీడీ తెలిపింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 363 (కిడ్నాప్), 328 (విషం ద్వారా గాయపరచడం మొదలైనవి, నేరం చేయాలనే ఉద్దేశ్యంతో), 376డి (గ్యాంగ్‌రేప్), 506 (నేరపూరిత బెదిరింపు) సంబంధిత సెక్షన్‌ల కింద గాజీపూర్ పోలీస్ స్టేషన్‌లో లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అజయ్‌ని అరెస్టు చేశామని, అతని సహచరులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వారు తెలిపారు. ఈ ఘటన మార్చి 14న జరగగా మార్చి 22న వెలుగులోకి వచ్చింది.

ఈ విషయంపై ఢిల్లీ పోలీసులకు డీసీడబ్ల్యూ నోటీసులు జారీ చేసింది. ఎంసీడీ స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడడం దారుణం. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి పాఠశాల ప్యూన్. ఇది చాలా తీవ్రమైన విషయం. నేను ఢిల్లీ పోలీసులకు ఎంసీడీకి నోటీసు జారీ చేస్తున్నాను. కఠిన చర్యలు తీసుకోవాలి. స్కూల్లో కూడా ఆడపిల్లకి భద్రత లేకపోతే ఆమె ఎక్కడికి వెళ్తుంది? అంటూ... డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ హిందీలో ట్వీట్ చేశారు.

Tags:    

Similar News