దేవరుప్పులలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి..

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఎనిమిది మందికి గాయాలైన సంఘటన దేవరుప్పుల మండలంలో చోటుచేసుకుంది.

Update: 2024-12-14 02:39 GMT

దిశ, దేవరుప్పుల : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఎనిమిది మందికి గాయాలైన సంఘటన దేవరుప్పుల మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జనగామ నుండి తిరుమలగిరి వైపు వస్తున్న అశోక్ లేలాండ్ ట్రాలీ వాహనం, తిరుమలగిరి నుండి జనగామ వైపు వస్తున్న తవేరా వాహనాలు చింత బావి తండా బస్టాండ్ వద్ద ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో దేవరుప్పుల మండలం కామారెడ్డి గూడెం గ్రామానికి చెందిన మరిపెల్లి, యకన్న, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి గ్రామానికి చెందిన సంపత్ లు అక్కడిక్కడే మృతి చెందారు. మిగిలిన క్షతగాత్రులను హుటాహుటిన జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News