కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఎంత మంది చనిపోయారంటే..

ఇటుకలు అన్ లోడ్ చేసి తిరిగి వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు.

Update: 2022-10-11 09:36 GMT

దిశ, కామారెడ్డి రూరల్ :ఇటుకలు అన్ లోడ్ చేసి తిరిగి వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు.ఈ సంఘటన కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామ శివారులోని సరస్వతి ఆలయ సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. మృతి చెందిన వారు కౌరిగిరి జ్యోతి(25), సౌటూరి చంచయ్య(35) గా గుర్తించారు. మరో ముగ్గురు ఏడుకొండలు, శ్రీనివాస్, కోలయ్యలు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వీరిని కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరంతా ఆంధ్రలోని నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.

దేవునిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. రామారెడ్డి మండలం మోషంపుర్ గ్రామ శివారులో ఇటుక బట్టిలో ఏడుకొండలు, శ్రీనివాస్, కోలయ్య, జ్యోతి, చెంచయ్యలు ఇటుక ట్రాక్టర్లలో లొడ్ చేసుకున్నారు. కామారెడ్డిలో ఆన్ లోడ్ చేసేందుకు వెళ్లి అక్కడ ఆన్ లోడ్ చేసి తిరిగి వెళ్తుండగా అడ్లూరు గ్రామ శివారులోని సరస్వతి ఆలయ సమీపంలోని జాతీయ రహదారిపై ఎదురుగా లారీ రావడంతో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో జ్యోతి, చెంచయ్యలు అక్కడికక్కడే మృతి చెందగా ఏడుకొండలు, శ్రీనివాస్, కొలయ్యలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News