విహారయాత్రలో విషాదం.. గోవాకు వెళ్లిన వ్యక్తి గుండెపోటుతో మృతి

ధర్మవరం మున్సిపాలిటీ లైసెన్స్ సర్వేయర్ బెస్త రాఘవ(30) గుండెపోటుతో మృతి చెందాడు.

Update: 2024-11-29 14:55 GMT

దిశ ప్రతినిధి,ధర్మవరం: ధర్మవరం మున్సిపాలిటీ లైసెన్స్ సర్వేయర్ బెస్త రాఘవ(30) గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బెస్త రాఘవ స్నేహితులతో కలిసి గోవాకు వెళ్ళాడు. సముద్రంలో ఈదలాడుతుండగా ఛాతిలో నొప్పిగా ఉందని స్నేహితులకు తెలిపాడు. దీంతో స్నేహితులు గోవాలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. రాఘవ తండ్రి బెస్త రవి ధర్మవరం మున్సిపాలిటీలో ఆర్ఐగా 20 సంవత్సరాలుగా విధులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.


Similar News