టాప్ ఫ్లోర్ నుంచి కింద పడిన లిఫ్ట్.. ముగ్గురు స్పాట్ డెడ్..
ఎన్టీఆర్ జిల్లాలో ఘోర విషాదం నెలకొంది. ఇబ్రహింపట్నం వీటీపీఎస్‌లో లిఫ్ట్ పై నుంచి వేగంగా కిందపడటంతో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా పలువురికి గాయాలు అయ్యాయి.
దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్ జిల్లాలో ఘోర విషాదం నెలకొంది. ఇబ్రహింపట్నం వీటీపీఎస్‌లో లిఫ్ట్ పై నుంచి వేగంగా కిందపడటంతో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా పలువురికి గాయాలు అయ్యాయి. లిఫ్ట్‌లో ఉన్నవారు తెలిపిన వివరాల ప్రకారం.. వీటీపీఎస్‌లో లిఫ్ట్ పై నుంచి కిందకు వస్తుంది. ఆ సమయంలో అందులో 8 మంది వరకు ఉన్నారు. లిఫ్ట్ కేబుల్ వైర్ తెగిపోవడంతో ఒక్కసారిగా లిఫ్ట్ పైనుంచి మెరుపు వేగంతో కింద పడిపోయింది. దీంతో లిఫ్ట్‌లో ఉన్న వారిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి గాయాలు అయ్యాయని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.