అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ కు తీవ్ర గాయాలు..

అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ కు తీవ్ర గాయలైన సంఘటన వీపనగండ్ల మండల పరిధిలో జరిగింది.

Update: 2023-05-30 15:32 GMT
అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ కు తీవ్ర గాయాలు..
  • whatsapp icon

దిశ, వీపనగండ్ల: అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ కు తీవ్ర గాయలైన సంఘటన వీపనగండ్ల మండల పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని పాతపల్లికి సమీపంలో గల చింతలకుంట ఆంజనేయస్వామి ని దర్శించుకోవటానికి ట్రాక్టర్ పై వెళ్లారు. దైవదర్శనం అనంతరం తిరిగి వస్తుండగా గోవర్ధనగిరి సమీపంలో మలుపు దగ్గర అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్  బలరాంకు తీవ్ర గాయాలైనాయి. దీంతో పెబ్బేరు ఆసుపత్రికి తరలించారు. అలాగే ట్రాక్టర్ ట్రాలీలో ఉన్నవాళ్లు అప్రమత్తమై దూకడంతో వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Tags:    

Similar News