పండగ పూట దారుణం.. తండ్రిని హతమార్చిన కొడుకు..

శామీర్ పేటలో దారుణం చోటుచేసుకుంది. సంక్రాంతి పండుగ రోజున కన్న కొడుకే తండ్రిని హత్య చేసిన సంఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.

Update: 2025-01-15 05:26 GMT

దిశ, శామీర్ పేట్ : శామీర్ పేటలో దారుణం చోటుచేసుకుంది. సంక్రాంతి పండుగ రోజున కన్న కొడుకే తండ్రిని హత్య చేసిన సంఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. శామీర్ పేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శామీర్ పేట్ మండల కేంద్రం పెద్దమ్మ కాలనీలో నివాసముంటున్న అలకుంట్ల హనుమంతు (50) కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసై రోజు తాగి వచ్చి ఆ మైకంలో ఇంట్లో గొడవ చేస్తుండేవాడు. సంక్రాంతి పండుగ రోజున కూడా ఇదే సీన్ రిపీట్ కావడంతో ఆవేశానికి గురైన తన కొడుకు ఆలకుంట్ల నర్సింగ్ రావు రోకలి బండతో తండ్రి హనుమంతును కొట్టి చంపాడని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Similar News