16.43 కేజీల గంజాయి పట్టివేత

16.43 కేజీల గంజాయిని తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను ఖమ్మం ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు పట్టుకున్నారు.

Update: 2024-09-29 15:50 GMT

దిశ,మణుగూరు : 16.43 కేజీల గంజాయిని తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను ఖమ్మం ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం మండలంలోని రథంగుట్ట అర్బన్ పార్క్ ఎదురుగా పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని విచారించగా ఒరిస్సాలోని మల్కాజ్గిరి నుంచి టేకులపల్లి, జగిత్యాల, సూర్యాపేటకు 16.43 కేజీల గంజాయిని తరలిస్తున్నారని తెలిపారు.

    దాంతో వారిని అదుపులో తీసుకొని గంజాయితో పాటు మూడు బైక్​లను సీజ్ చేశారు. వీరిలో కమల అరవింద్, మారంపల్లి లక్ష్మణ్ జగిత్యాలకు చెందిన వారు కాగా, బొమ్మ కంటి గోపి, పర్సబోయిన రమేష్ సూర్యాపేటకి చెందినవారని, బుక్య సాయికుమార్, గుగులోతు నవీన్ కుమార్ టేకులపల్లి వాసులు. ఈ కేసును మణుగూరు ఎక్సైజ్ శాఖ సీఐ రాజి రెడ్డికి అప్పగించామని, ఈ కేసుపై పూర్తి విచారణ చేయాలని ఆదేశించామని తిరుపతి తెలిపారు. ఈ తనిఖీలో డీసీ జనార్దన్ రెడ్డి, ఏసీ గణేష్, ఎన్​ఫోర్స్​మెంట్ సీఐ సీహెచ్. శ్రీనివాస్, సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ కరీం, బాలు, కానిస్టేబుళ్లు సుధీర్, వెంకట్, విజయ్, హనుమంతరావు పాల్గొన్నారు.  

Tags:    

Similar News