దేవునికి వెలిగించిన దీపం.. రేకుల ఇల్లు దగ్ధం..
నిజామాబాద్ పోతంగల్ మండలం కల్లూరు గ్రామంలో అగ్నిప్రమాదం వల్ల రేకుల ఇల్లు పూర్తిగా కాలిపోయింది.

దిశ, పోతంగల్ : నిజామాబాద్ పోతంగల్ మండలం కల్లూరు గ్రామంలో అగ్నిప్రమాదం వల్ల రేకుల ఇల్లు పూర్తిగా కాలిపోయింది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం కల్లూరు గ్రామానికి చెందిన బీర్కూర్ భారతి, గంగారాంలు సోమవారం ఉదయం ఇంటిలో పూజ కార్యక్రమలు ముగించుకొని కూలి పనికి వెళ్లారు. కాగా దేవుడి చిత్రపటాల వద్ద వెలిగించిన దీపం ప్రమాదవశాత్తు కింద పడడంతో మంటలు చెలరేగి రేకుల ఇంటితో పాటు బట్టలు, బంగారు, వెండి ఆభరణాలు వస్తువులు పూర్తిగా కాలిపోవడంతో రెండు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు.