ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి దుర్మరణం

ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన చిగురుమామిడి మండల పరిధిలోని సుందరగిరి, బొమ్మనపల్లి గ్రామాల మధ్య గురువారం చోటుచేసుకుంది.

Update: 2023-05-04 09:26 GMT
ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి దుర్మరణం
  • whatsapp icon

దిశ, చిగురుమామిడి : ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన చిగురుమామిడి మండల పరిధిలోని సుందరగిరి, బొమ్మనపల్లి గ్రామాల మధ్య గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సుందరగిరి గ్రామానికి చెందిన మెడబోయిన మల్లేషం(56) తన వ్యక్తిగత పని నిమిత్తం మరో ఇద్దరు పత్తెం సంపత్, అనిల్ లతో కలిసి బొమ్మనపల్లికి బయలుదేరారు. ఈ క్రమంలో మర్గమధ్యలో రోడ్డు పక్కనే ఆగి ఉన్న మల్లేషం ద్విచక్ర వాహనాన్ని హుజురాబాద్ నుంచి హుస్నాబాద్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లేషం అక్కడికక్కడే మృతిచెందగా.. పత్తేం సంపత్, అనిల్ లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 సిబ్బంది అంబులెన్స్ లో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలాన్ని చిగురుమామిడి ఎస్సై సామల రాజేష్ పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Tags:    

Similar News