మహిళ పై అత్యాచారం హత్య.. ఉలిక్కి పడ్డ నగరం..
పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో కూడా మహిళలకు రక్షణ కరువైంది.
దిశ, కుత్బుల్లాపూర్ : పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో కూడా మహిళలకు రక్షణ కరువైంది. ఎక్కడో నిర్మానుష్య ప్రాంతంలో ఇలాంటి అమానుష సంఘటనలు జరగడం మాములే. కానీ కుత్బుల్లాపూర్ జంట సర్కిల్ కార్యాలయాల కూడలిలో గల పుట్ పాత్ పై పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఓ మహిళ పై అత్యాచారం చేసి హత్య చేయడం పై నగర శివారు ప్రాంతం ఉలిక్కి పడింది. నర్సాపూర్ ప్రధాన రహదారి, కుత్బుల్లాపూర్ సర్కిల్ చౌరస్తా అయినప్పటికీ పోలీస్ పెట్రోలింగ్ ఏమైందో అని పలువురు గుసగుసలాడుతున్నారు. ప్రధాన రహదారిలోనే పోలీస్ పెట్రోలింగ్ ఈ విధంగా ఉంటే ఇక జీడిమెట్ల పీఎస్ పరిధిలోని కాలనీల పరిస్థితి ఏమిటని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఈ ఘటన పై జీడిమెట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళ ఎవరు, ఎక్కడి నుండి వచ్చింది అని ఆరా తీస్తున్నారు. క్లూస్ టీంను రప్పించి మహిళ అత్యాచారం, హత్య కేసును ఛేదించే పనిలో నిమగ్నం అయ్యారు.