Rape in moving ambulance : కదులుతున్న అంబులెన్స్‌లో మైనర్‌పై లైంగిక దాడి

కదులుతున్న అంబులెన్స్‌లో 16ఏళ్ల మైనర్ బాలికపై లైంగికదాడి తీవ్ర కలకలం రేపింది.

Update: 2024-11-29 10:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కదులుతున్న అంబులెన్స్‌లో 16ఏళ్ల మైనర్ బాలికపై లైంగికదాడి తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ మౌగంజ్ జిల్లాలో చోటు చేసుకుంది. డీఐజీ సాకెత్ ప్రకాష్ పాండే తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 22న కదులుతున్న అంబులెన్స్‌లో 16ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగింది. నవంబర్ 25న బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగు చూసింది. మైనర్ బాలిక ప్రస్తుతం అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. అక్క, బావలతో కలిసి అంబులెన్స్‌లో ప్రయాణిస్తోంది. డ్రైవర్ మరో వ్యక్తి అదే అంబులెన్స్‌లో ఉన్నారు. అంతలోనే బాలిక అక్క, బావ అంబులెన్స్ దిగేశారు. అనంతరం అంబులెన్స్ స్పీడ్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం డ్రైవర్, అతని సహచరుడు కలిసి మైనర్‌పై కదులుతున్న అంబులెన్స్‌లో అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను రాత్రంతా బందీగా ఉంచిన ఇద్దరు నిందితులు మరుసటి రోజు ఆమెను రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. అయితే వీరిలో ఎవరూ పేషంట్లు కాకపోవడం గమనార్హం. బాలిక తన తల్లితో జరిగిన విషయం చెప్పింది. దీంతో ఈ నెల 25న పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరానికి సహకరించిందుకు బాలిక అక్క, బావలపై కలిపి మొత్తం నలుగురిపై పోక్సో కేసు నమోదు అయింది.

Tags:    

Similar News