ఓల్డ్ అల్వాల్ రామాలయం వీధిలో భారీ చోరీ
ఓల్డ్ అల్వాల్ రామాలయం వీధిలో ఇంటి తాళాలు పగుల గొట్టి గుర్తు తెలియని దుండుగులు చోరీకి పాల్పడిన సంఘటన శుక్రవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, అల్వాల్ : ఓల్డ్ అల్వాల్ రామాలయం వీధిలో ఇంటి తాళాలు పగుల గొట్టి గుర్తు తెలియని దుండుగులు చోరీకి పాల్పడిన సంఘటన శుక్రవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇంటి యజమాని మహేందర్ వరంగల్ లో ప్రైవేట్ ఉద్యోగి. ఈయన తల్లిదండ్రులు వారాసిగూడలో ఉంటారు. ఇటీవల ఆయన తండ్రికి అనారోగ్యం కారణంగా మూడు రోజుల క్రితం కుటుంబం మొత్తం వారాసిగూడకు వెళ్లారు. శుక్రవారం తాళం పగులకొట్టి ఉండడంతో ఇంటి పక్కవారు ఫోన్ చేయగా ఇంటికి చేరుకున్న మహేందర్ ఇంట్లో పద్దెనిమిదిన్నర తులాల బంగారం, కొంత నగదు దోచుకెళ్లినట్లు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ తో వేలి ముద్రలు సేకరించి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.