మియాపూర్ స్టాలిన్ నగర్ లో వివాహిత సూసైడ్.. అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు
అనుమానాస్పద స్థితిలో వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

దిశ, శేరిలింగంపల్లి : అనుమానాస్పద స్థితిలో వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం మేరకు.. మెదక్ జిల్లా అల్లాదుర్గంకు చెందిన అశోక్, భవానీ(20)లకు గత రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. బ్రతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి మియాపూర్ స్టాలిన్ నగర్ లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 8 నెలల పాప ఉంది. ఆదివారం రాత్రి భర్త అశోక్ బయటికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లోనే కిటికీకి ఉరి వేసుకోని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే భవానీ మృతిపై ఆమె కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు మృతురాలు భర్త అశోక్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.