పాముకాటుకు గురై చికిత్స పొందుతూ వ్యక్తి మృతి..

పాముకాటుకు గురై చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన పాపన్నపేటలో శుక్రవారం చోటు చేసుకుంది.

Update: 2024-11-29 11:23 GMT

దిశ, పాపన్నపేట : పాముకాటుకు గురై చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన పాపన్నపేటలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. పాపన్నపేటకు చెందిన పెద్ద కటికె నబీసాబ్ (36) వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 23న జీవాలను మేపడానికి బయటకు వెళ్ళగా గ్రామ శివారులో పాము కరిచింది. దీంతో ఇంట్లో వారికి చెప్పడంతో వారు చికిత్స కోసం మెదక్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గురువారం సాయంత్రం గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి అన్న షాదుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.


Similar News