బంధువుల అంత్యక్రియలకు వెళ్లి.. వ్యక్తి అనుమానాస్పద మృతి

తన సమీప బంధువు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో

Update: 2025-04-05 13:56 GMT
బంధువుల అంత్యక్రియలకు వెళ్లి.. వ్యక్తి అనుమానాస్పద మృతి
  • whatsapp icon

దిశ,నేరేడుచర్ల (పాలకవీడు): తన సమీప బంధువు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయన అంత్యక్రియలో పాల్గొనేందుకు వెళ్లి అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పాలకవీడు మండలంలోని శూన్య పహాడ్ గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. మృతుడు నేరేడుచర్ల మండలం చిల్లే పల్లి కి చెందిన వట్టే నాగరాజు(37) గా పోలీసులు గుర్తించారు. మృతుని బంధువులు పాలకవీడు ఎస్సై లక్ష్మీ నరసయ్య తెలిపిన వివరాల ప్రకారం చిల్లేపల్లికి చెందిన వట్టే నాగరాజు తన బైక్ పై శుక్రవారం మధ్యాహ్నం సమయంలో గరిడేపల్లి మండలంలోని కల్మలచెరువు గ్రామంలో తన బంధువు యాతవరపు సైదులు చనిపోవడంతో ఆయన అంత్యక్రియలో పాల్గొనేందుకు వెళ్లాడు.

మధ్యాహ్నం సమయంలో అతని సోదరుడు గంగరాజు ఫోన్ చేస్తే అంత్యక్రియలు పూర్తి చేసుకుని తను మరో వ్యక్తితో కలిసి దాచేపల్లి వెళుతున్నానని చెప్పారు. అయినా ఆయనకు పలు సార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అలాగే రాత్రి ఇంటికి రాకపోవడంతో అనుమానంతో రాత్రంతా వెతికామన్నారు. కానీ ఆయన ఫోన్ రింగ్ అయింది గానీ అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదని తెలిపారు. శనివారం మధ్యాహ్నం సమయంలో జాన్ పహాడ్ దర్గా నుంచి శూన్య పహాడ్ వెళ్లే రోడ్డులో పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ దాటిన తర్వాత రోడ్డు పక్కన కొంత దూరంలో వ్యక్తి తలకు గాయాలతో పడి ఉన్నారని సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి చూశామన్నారు.

నాగరాజు బండ పై పడుకొని ఉన్నాడని తలకు వెనుక వైపు భాగంలో గాయం కావడంతో బండ అంతా రక్తమయంగా మారి ఉందని అప్పటికే మృతి చెందాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. మృతుడు సోదరుడు గంగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు పడుతున్నట్లు పాలకవీడు ఎస్సై లక్ష్మీ నరసయ్య తెలిపారు. అతని వెంట వెళ్లిన వ్యక్తిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ కు తరలించి పోస్టుమార్టం చేయించారు. 

Similar News