ప్రమాదవశాత్తు కాలువలో పడి వ్యక్తి మృతి
ఏన్కూర్ సాగర్ మెయిన్ కెనాల్ లో గల్లంతైన వ్యక్తి మృతదేహం ఆదివారం లభించింది.

దిశ, తల్లాడ : ఏన్కూర్ సాగర్ మెయిన్ కెనాల్ లో గల్లంతైన వ్యక్తి మృతదేహం ఆదివారం లభించింది. స్థానిక ఎస్సై బి.కొండలరావు తెలిపిన వివరాల ప్రకారం తల్లాడ మండలం, అన్నారు గూడెం గ్రామానికి చెందిన కాటుకూరి జయరాజు (58) అనే వ్యక్తి ఏన్కూర్ సాగర్ కెనాల్ గొడ్ల బ్రిడ్జి వద్ద కాళ్లు చేతులు కడుక్కునేందుకు దిగాడని తెలిపారు. ఈ క్రమంలో కాలుజారి సాగర్ కారులో పడిపోయాడని, నీటి ప్రవాహం ఎక్కువ ఉండటంతో గల్లంతయ్యాడని తెలిపారు. గాలింపు చర్యలు చేపట్టగా లోకవరం బ్రిడ్జి వద్ద అతని మృతదేహం లభ్యమయిందని, పోస్టుమార్టం నిమిత్తం వ్యక్తి మృతదేహాన్ని మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిపారు. మృతుని కుమారుడు కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.