Fire Accident: హయత్‌నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. వరుసగా పేలుతోన్న సిలిండర్లు
భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండల పరిధిలోని కుంట్లూరులో చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన రంగారెడ్డి జిల్లా (Rangareddy District) హయత్‌నగర్ (Hayathnagar) మండల పరిధిలోని కుంట్లూరు (Kuntloor)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని రావి నారాయణ రెడ్డి నగర్ (Ravi Nayayana Reddy Nagar) పరిధిలోని ఓ గుడిసెలో ఉన్నట్టుండి మంటలు ఎగసిపడ్డాయి. వేసవి తాపానికి పక్కనే మరో 30 గుడిసెలు కూడా వేగంగా మంటలు అంటుకుని అగ్నికి ఆహుతయ్యాయి. అయితే, గుడిసెల్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు ఒక్కొక్కటి పేలుతుండటంలో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేయగా.. వారు మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.