వీడిన అటెండర్ జగదీష్ మర్డర్ మిస్టరీ..

ప్రియుడుతో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసిన భార్య

Update: 2024-11-29 07:29 GMT

దిశ, నాగర్ కర్నూల్ : ప్రియుడుతో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసిన భార్య. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం కేఎల్ఐ కాలువ వద్ద చోటు చేసుకుంది . ఈ ఘటనపై శుక్రవారం నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తూడుకుర్తి గ్రామానికి చెందిన జగదీష్, కీర్తి ఇద్దరు భార్యాభర్తలు. వీరికి 2011 సంవత్సరంలో ప్రేమ వివాహం జరిగింది. వీరికి 12 సంవత్సరాల కుమారుడు సాయి అక్రంత్ , 9 సంవత్సరాల కూతురు మృతి శరణ్య ఉన్నారు. తండ్రి లక్ష్మయ్య టీచర్గా పనిచేస్తూ చనిపోగా మృతునికి అటెండర్ ఉద్యోగం వచ్చింది.

ప్రస్తుతం బిజినపల్లి మండలం ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతని భార్య కీర్తి కల్వకుర్తికి చెందిన ఎస్.బి.ఎం రియల్ ఎస్టేట్ సంస్థలో సేల్స్ మెన్ గా పని చేయుటకు వెళ్ళింది. అక్కడ గుడ్ల నర్వ గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో ఇరు కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.ఊరు పెద్దమనుషుల సమక్షంలో నచ్చచెప్పిన కీర్తి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఎలాగైనా తన భర్త జగదీష్ ను అడ్డు తొలగించుకోవాలని పథకం రచించింది. ఈనెల 24న దేవుని దర్శనం పేరిట తన అత్తగారి ఇంటికి తూడుకుర్తి తీసుకు వెళ్ళింది.

ప్రియుడు నాగరాజుతో మందు కలిపిన కల్లు తెప్పించి భర్త జగదీష్ కు తాపించింది. స్పృహ కోల్పోయిన తర్వాత జగదీష్ ను తీసుకొని పక్కనే ఉన్న కేలై కాలువ వద్దకు తీసుకువెళ్లి ప్రియుడు అతని స్నేహితుల సహాయంతో హత్య చేసి అందులో పడేశారు . మరుసటి రోజు 25 వ తారీకు కీ కేఎల్ఐవలో డెడ్ బాడీ కనిపించిందని స్థానికులు బిజినపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.

మృతుడి తరపు వారు ఫిర్యాదు చేయడంతో భార్య కీర్తిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసింది తానేనని అంగీకరించింది. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులకు తెలిపింది. ఈ కేసులో శుక్రవారం నిందితులను కీర్తి,నాగరాజు,సాయికుమార్,పద్మ వారికి సహకరించిన కుట్రలో భాగమైన శివ, సుధాకర్లను అరెస్టు చేశారు. రిమాండ్ కు తరలించారు. పరారీలో ఉన్న మోహన్ త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.శారీరక సుఖానికి అలవాటు పడి కుటుంబాలను నాశనం చేసుకోకూడదని జిల్లా ప్రజలకు డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు సూచించారు.


Similar News