ఫీనిక్స్ కంపెనీలో రాజకీయ ప్రముఖుల పెట్టబుడులు

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో ఐటీ అధికారుల వరుస దాడులు కలకలం రేపుతున్నాయి.

Update: 2022-08-23 06:44 GMT
ఫీనిక్స్ కంపెనీలో రాజకీయ ప్రముఖుల పెట్టబుడులు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో ఐటీ అధికారుల వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. మాదాపూర్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన ఫీనిక్స్‌పై మంగళవారం ఇన్‌కమ్‌ ట్యాక్స్ అధికారులు దాడులు జరిపారు. 25 వాహనాల్లో.. 150 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులు ఒక్కసారిగా కంపెనీపై అటాక్ చేశారు. వినియోగదారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఐటీ చూపించకపోవడం వల్లనే ఈ ఐటీ దాడులు కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, ఫీనిక్స్‌లో చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. కంపెనీ చైర్మన్ చుక్కపల్లి సురేశ్‌తో పాటు సంస్థ డైరెక్టర్ల ఇళ్లలోనూ ఐటీ అధికారులు దాడులు జరుపుతున్నారు. కాగా, ఫీనిక్స్ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News