భారీ రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఐదుగురు కూలీలు మృతి

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఉదయాన్నే కూలీలతో వెళ్తున్న ఆటోను అటుగా వస్తున్న లారీ ఢీకొట్టింది.

Update: 2023-05-17 02:20 GMT
భారీ రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఐదుగురు కూలీలు మృతి
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఉదయాన్నే కూలీలతో వెళ్తున్న ఆటోను అటుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు కూలీలు అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తుంది. పోలీసులు చనిపోయిన వారిని.. మంజుల, భూక్య పద్మ, సుక్ర, సోని, కవిత గా గుర్తించారు. ఈ విషాద సంఘటన దాచేపల్లి మండలం పొందుగుల దగ్గర ఈ ఘటన చోటు చేసుకోగా.. ప్రమాద సమయంలో ఆటోలో 23 మంది కూలీలు ఉన్నట్లు తెలిపారు.

Tags:    

Similar News