మద్యం తాగొద్దంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు..?

తాగొద్దని మందలించడంతో భార్యపై కోపగించి ఇంట్లో నుంచి భర్త వెళ్లిపోయిన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Update: 2023-06-07 10:46 GMT
మద్యం తాగొద్దంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు..?
  • whatsapp icon

దిశ, జవహర్ నగర్: తాగొద్దని మందలించడంతో భార్యపై కోపగించి ఇంట్లో నుంచి భర్త వెళ్లిపోయిన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధి జ్యోతి కాలనీలోని రామాలయం సమీపంలో నివాసం ఉంటున్న దొంగిల్ దేవిదాస్ నాగనాథ్(31) టైలర్, తన భార్య దొంగిల్ల లావణ్య (28) బీడీ తయారీ వృత్తుల్లో జీవిస్తున్నారు.

గత కొంత కాలంగా దొంగిల్ దేవిదాస్ నాగనాథ్ మద్యానికి అలవాటుపడ్డాడు. దీంతో మంగళవారం దొంగిల్ల లావణ్య భర్తను తాగొద్దని వారించింది. దీంతో ఇరువురి మధ్య వాదోపవాదాలు జరిగాయి. కోపంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తిరిగి ఇంటికి రాకపోవడంతో బుధవారం దొంగిల్ల లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News