క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలు చేస్తున్న ముఠా గుట్టు రట్టు

క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ పేరుతో బ్లాక్ చైన్ సిస్టం ద్వారా మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న ముఠాను జగిత్యాల పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Update: 2024-10-19 16:14 GMT

దిశ, జగిత్యాల టౌన్ : క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ పేరుతో బ్లాక్ చైన్ సిస్టం ద్వారా మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న ముఠాను జగిత్యాల పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ బిజినెస్ పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో జగిత్యాలకు చెందిన గుమ్మిడల్ల నర్సయ్య, కోయల్కర్ వేణు, ఆరె రాజేశ్, పురెళ్ల బాపు, కొట్టే మారుతి లతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేసినట్టు పట్టణ సీఐ వేణుగోపాల్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెక్సోస్ ట్రేడింగ్ ఆఫ్​ ద్వారా యూఎస్డీటీ బీఈపీ 20 అనే క్రిప్టో కరెన్సీ పై నిందితులు జిల్లా వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టించినట్లు తెలిపారు.

    ఈజీ మణికి అలవాటు పడిన ఈ ముఠా కొందరు ప్రభుత్వ ఉద్యోగులతోపాటు అమాయకులను అధిక లాభాల ఆశ చూపి డబ్బులు కట్టించుకున్నట్లు పేర్కొన్నారు. చైన్ సిస్టం ద్వారా ఎక్కువ మందిని జాయిన్ చేస్తే కమీషన్ వస్తుందని 18 నెలల్లో పెట్టుబడి కాకుండా 5 నుండి 10 రెట్లు వస్తాయని మోసాలకు పాల్పడినట్లుగా గుర్తించారు. ఇలాంటి ట్రేడింగ్ యాప్ లు ఆన్లైన్ బిజినెస్ లో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని జగిత్యాల ప్రజలకు సీఐ వేణుగోపాల్ సూచించారు. ఇలాంటి బిజినెస్ లు చేసే వారి సమాచారం పోలీసులకు ఇవ్వాల్సిందిగా కోరారు. 

Tags:    

Similar News