గోవా మద్యం స్వాధీనం.. నలుగురి అరెస్ట్
గోవా నుంచి మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్న నలుగురిని ఘట్కేసర్ ఎక్సయిజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: గోవా నుంచి మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్న నలుగురిని ఘట్కేసర్ ఎక్సయిజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 521 మద్యం సీసాలు, కారు, డీసీఎం వ్యాన్ ను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. గోవా నుంచి తెచ్చిన మద్యం రవాణా అవుతున్నట్టు సమాచారం అందటంతో మంగళవారం రాత్రి ఘట్కేసర్ పోలీసులు బోడుప్పల్‌లోని బంగారు మైసమ్మ ఆలయం వద్ద రూట్ వాచ్ పెట్టారు. అదే సమయంలో ఉప్పల్మల్లికార్జుననగర్నివాసి ఏ.జగదీశ్వర్ద్విచక్ర వాహనంపై అటుగా వచ్చాడు. అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని పట్టుకుని తనిఖీ చేయగా పది మద్యం బాటిళ్లు దొరికాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంట్లో జగదీశ్వర్బోడుప్పల్టెలిఫోన్కాలనీలో నివాసముంటున్న పున్నా బాలరాజు వద్ద కూడా గోవా మద్యం బాటిళ్లు ఉన్నట్టుగా వెల్లడైంది. ఈ క్రమంలో పోలీసులు కారులో వెళుతుండగా బాలరాజును పట్టుకున్నారు.
తనిఖీ చేయగా అయిదు బ్యాగుల్లో ప్యాక్‌చేసి ఉన్న 107 లీటర్ల మద్యం సీసాలు దొరికాయి. ఇక, జగదీశ్వర్ఇచ్చిన సమాచారం మేరకు సిద్దిపేట శ్రీనగర్‌కాలనీకి చెందిన తాళ్లపల్లి హరికృష్ణగౌడ్ను అదుపులోకి తీసుకోగా అతని వద్ద 614.25 లీటర్ల మద్యం సీసాలు పట్టుబడ్డాయి. ఇక, హరికృష్ణగౌడ్విచారణలో వెల్లడించిన వివరాల మేరకు నాచారం అంబేద్కర్భవన్ప్రాంతంలో ఉంటున్న ఏ.సురేందర్‌ను పట్టుకున్నారు. అతని వద్ద కూడా పెద్ద సంఖ్యలో మద్యం బాటిళ్లు దొరికాయి. సీజ్చేసిన మద్యం మొత్తం నాన్‌డ్యూటీ పెయిడ్దేనని అధికారులు తెలిపారు. దాడుల్లో ఎక్సయిజ్అధికారులు మల్లయ్య, శ్రావణి, అశోక్, మక్భూల్, వెంకట్‌రెడ్డి, రాఘవేందర్, నరేశ్, రాజేశ్, దీపిక, ఎం.దీపిక పాల్గొన్నారు.