12ఏళ్ల మైనర్ బాలిక పై గ్యాంగ్ రేప్..
దిశ, వెబ్డెస్క్: దేశంలో మైనర్ల పై రోజు రోజుకూ అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి.. Latest Telugu News
దిశ, వెబ్డెస్క్: దేశంలో మైనర్ల పై రోజు రోజుకూ అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం నిర్భయ, దిశ, పోక్సో లాంటి ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా చిన్నారులు, బాలికలు, మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. కామాంధులు మృగాళ్లుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా రాజస్ధాన్లో దారుణం జరిగింది.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. భరత్పూర్లో మే 13న ఇద్దరు వ్యక్తులు 12 ఏండ్ల బాలికను తుపాకీతో బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. మరుసటి రోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో బాలికను కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆ తర్వాత బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, నిందితులను ఇప్పటివరకూ అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. పోలీసులు ఇప్పటివరకూ నిందితులను అరెస్ట్ చేయలేదని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధిత బాలిక తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.