రోడ్డు ప్రమాదంలో మాజీ ఎంపీటీసీ మృతి
కరీంనగర్-జగిత్యాల హైవేపై గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.
దిశ, గంగాధర: కరీంనగర్-జగిత్యాల హైవేపై గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కురిక్యాల మాజీ ఎంపీటీసీ అలువోజి నందయ్య తీవ్రగాయాలతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్ లో కరీంనగర్ సివిల్ హాస్పిటల్ తరలిస్తుండగా నందయ్య మార్గమధ్యలో చనిపోయారు. గంగాధర ఎస్సై నరేందర్ రెడ్డి సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.