తీర్ధ యాత్రలో విషాదం.. వృద్ధ యాత్రికుని సజీవ దహనం..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వృందావన్ క్షేత్రంలో తెలంగాణ యాత్రికులకు పెను ప్రమాదం తప్పింది.

Update: 2025-01-15 02:30 GMT
తీర్ధ యాత్రలో విషాదం.. వృద్ధ యాత్రికుని సజీవ దహనం..
  • whatsapp icon

దిశ, భైంసా : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వృందావన్ క్షేత్రంలో తెలంగాణ యాత్రికులకు పెను ప్రమాదం తప్పింది. జనవరి 1 వ తేదీన ముదోల్ నుంచి యాత్రికులతో బయలు దేరిన బస్సు మంగళవారం సాయంత్రం అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనకి సంబంధించి యాత్రికులు తెలిపిన వివరాలు ఈ విధంగా వున్నాయి. కుభీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన వృద్ధుడు సిలెం దురుపతి (63) సజీవ దహనం అయ్యారని, బస్సుతో పాటు యాత్రికులకు సంబంధించిన సామాగ్రి, దుస్తులు, నగదు, ఇతర వస్తువులు పూర్తిగా దగ్దమయ్యాయని తెలిపారు. బస్సులో దాదాపు 50 మంది యాత్రికులు వృందావన్ క్షేత్ర సందర్శనానికి వెళ్ళారని తెలిపారు. అనారోగ్య కారణాలతో దురుపతి బస్సులోనే ఉండిపోగా అతని సతీమణి మిగతా  యాత్రికులతో కలిసి దర్శనానికి వెళ్ళిందని తెలిపారు. దర్శనానికి వెళ్ళి వచ్చే సరికి బస్సు దగ్దమైవుందని  తెలిపారు. 

రక్షణ చర్యలు వేగవంతం చేయాలి.. ఎమ్మెల్యే రామారావు పటేల్

బస్సు ప్రమాద ఘటన పై వృందావన్ క్షేత్ర కలెక్టర్, ఎస్పీతో ‘ఫోన్ ద్వారా మాట్లాడి యాత్రికుల యోగ క్షేమాలు తెలుసుకున్నారు ఎమ్మెల్యే రామారావు పటేల్. యాత్రికులను సురక్షితంగా తరలించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాద ఘటన, అక్కడ చిక్కుకున్న యాత్రికుల వివరాలను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దృష్టికి సైతం తీసుకు వెళ్లినట్లుగా సమాచారం. కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడి అధికారులతో మాట్లాడి యాత్రికుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని సూచించినట్టు సమాచారం.


Similar News