నా కూతుర్ని కళాశాల అధికారులే చంపారు.. పూరి ఉజ్వల
ఉదయం నుండి కళాశాల అధికారులతో తమ కూతురి ఆత్మహత్య విషయమై చర్చలు జరిపిన తమకు కళాశాల అధికారులు ఎటువంటి సరైన సమాధానం ఇవ్వలేదని అన్నారు.
దిశ, బాసర : ఉదయం నుండి కళాశాల అధికారులతో తమ కూతురి ఆత్మహత్య విషయమై చర్చలు జరిపిన తమకు కళాశాల అధికారులు ఎటువంటి సరైన సమాధానం ఇవ్వలేదని అన్నారు. తన కూతురి మరణానికి కళాశాలలోని కొందరు అధికారుల ముఖ్యపాత్ర అయుండొచ్చని తల్లి పూరి ఉజ్వల ప్రధాన గేటు వద్ద విలేకరులతో అన్నారు. ఉదయం ఫోన్లో సంతోషంగా మాట్లాడి బ్రేక్ ఫాస్ట్ చేయడానికి వెళుతున్నాను మమ్మీ అని చెప్పి ఆత్మహత్య చేసుకోవడానికి ఎలా వెళుతుందని ఆమె ప్రశ్నించారు. తను ఆత్మహత్య చేసుకున్న అనంతరం అక్కడే సూసైడ్ నోట్ లభించిందని చెప్పిన అధికారులు ఇప్పటి వరకు తమకు ఆ సూసైడ్ నోట్ చూపించలేదని ప్రశ్నించారు. ఇది కల్పితమేనని తన కూతురి పై కక్షతో అందులోని అధికారులు చంపి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. తన కూతురి మరణం పై స్థానిక కళాశాల అధికారుల ప్రమేయం ఉందని ఈ మేరకు కలెక్టర్కు, ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తండ్రి రవీందర్ తెలిపారు.