Drugs Seize: నార్కొటిక్ బ్యూరో, ఢిల్లీ పోలీసుల జాయింట్ ఆపరేషన్.. 95 కిలోల డ్రగ్స్ స్వాధీనం, నలుగురు అరెస్ట్

దేశ వ్యాప్తంగా డ్రగ్స్ (Drugs), గంజాయి (Ganja) వినియోగం విచ్చలవిడిగా పెరుగుతోన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Update: 2024-10-29 09:20 GMT
Drugs Seize: నార్కొటిక్ బ్యూరో, ఢిల్లీ పోలీసుల జాయింట్ ఆపరేషన్.. 95 కిలోల డ్రగ్స్ స్వాధీనం, నలుగురు అరెస్ట్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా డ్రగ్స్ (Drugs), గంజాయి (Ganja) వినియోగం విచ్చలవిడిగా పెరుగుతోన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్వదేశంలో తయారు అవుతోన్న, విదేశాల నుంచి అక్రమంగా వస్తున్న డగ్స్‌పై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి ఉక్కుపాదం మోపాలని సూచించింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న ఎయిర్‌పోర్టులు (Airports), ఓడరేవు (Ports)లను కస్టమ్స్ అధికారులు (Customs officials), నార్కొటిక్ బ్యూరో (Narcotics Bureau) అధికారులు నిత్యం జల్లెడ పడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి బ్యాగేజీలు, కంటైనర్లను క్లియర్‌గా చెక్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో డ్రగ్స్ అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు నార్కొటిక్ బ్యూరో (Narcotics Bureau), స్థానిక పోలీసులు (Local Police) జాయింట్ ఆపరేషన్ (Joint Operation) నిర్వహించారు. ఈ దాడుల్లో నిందితుల నుంచి మొత్తం 95 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అక్రమంగా నిషేధిత డ్రగ్స్‌ (Prohibited Drugs)ను తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. అయితే, ఇదే ముఠా భారత్‌ (India)తో పాటు ఇతర దేశాలకు గుట్టచప్పుడు కాకుండా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా తెలిసింది. ముంబై (Mumbai)‌లోని ఓ ఫార్మా కంపెనీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. తిహార్ జైలు (Tihar Jail)లో ఉన్న ఓ వార్డెన్‌తో కలిసి నిందితులు డ్రగ్స్ దందాకు తెర లేపారని నార్కొటిక్ బ్యూరో, ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

Tags:    

Similar News