కాల్వలో కొట్టుకుపోయిన తండ్రి కొడుకుల మృతదేహాలు లభ్యం..

కనగల్లు మండలం శాబ్దులపురం గ్రామానికి చెందిన సురవరం దామోదర్, అతని కుమారుడు ఫణీంద్ర వర్మ శనివారం గ్రామ సమీపంలోని ఏఎంఆర్పీ ప్రధాన కాలువ వద్ద స్నానం చేస్తుండగా ప్రమాదవశత్తు కాలుజారి కాలువలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.

Update: 2024-11-03 10:20 GMT

దిశ, కనగల్లు : కనగల్లు మండలం శాబ్దులపురం గ్రామానికి చెందిన సురవరం దామోదర్, అతని కుమారుడు ఫణీంద్ర వర్మ శనివారం గ్రామ సమీపంలోని ఏఎంఆర్పీ ప్రధాన కాలువ వద్ద స్నానం చేస్తుండగా ప్రమాదవశత్తు కాలుజారి కాలువలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో వారి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం ఉదయం నల్గొండ మండలం గుండ్లపల్లి ప్రధాన కాలువ వద్ద సురవరం దామోదర్(39) మృతదేహం లభ్యం అయ్యింది. అతని కుమారుడు ఫణీంద్ర వర్మ (14)మృతదేహం కోదండపురం కాలువ వద్ద లభ్యమయింది. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు కనగల్లు ఎస్సై పి.విష్ణు తెలిపారు.

Tags:    

Similar News