కానిస్టేబుల్ మెడ కోసిన చైనీస్ మాంజా..

గాలిపటాలు ఎగరేయడానికి ఉపయోగించే ‘చైనీస్ మాంజా’ ప్రమాదకరమని చెప్తున్నా.. కొందరు ఇంకా ఆ దారాలు వాడుతూనే ఉన్నారు.

Update: 2025-01-15 06:17 GMT
కానిస్టేబుల్ మెడ కోసిన చైనీస్ మాంజా..
  • whatsapp icon

దిశ, హిమాయత్ నగర్ : గాలిపటాలు ఎగరేయడానికి ఉపయోగించే ‘చైనీస్ మాంజా’ ప్రమాదకరమని చెప్తున్నా.. కొందరు ఇంకా ఆ దారాలు వాడుతూనే ఉన్నారు. బుధవారం నారాయణగూడ పీఎస్ పరిధిలోని స్థానికుల సమాచారం ప్రకారం లంగర్‌హౌస్ ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శివరాజ్ నారాయణగూడ ఫ్లైఓవర్ నుంచి తిలక్ నగర్ రోడ్డుకు ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే చైనీస్ మాంజా అతని మెడకు తగిలి చర్మాన్ని కోసుకుపోయి తీవ్ర రక్తస్రావమైంది. కాగా బాధితుడు ప్రస్తుతం ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News