విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరిపై కేసు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పోలీసు విధులకు ఆటంకం కల్పిస్తూ ఎదురు తిరిగిన ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దిశ,బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పోలీసు విధులకు ఆటంకం కల్పిస్తూ ఎదురు తిరిగిన ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెల్లంపల్లి టూ టౌన్ ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 9న రాత్రి 12.15 గంటలకి రైల్వేస్టేషన్ పెద్దనపల్లి ఏరియాలో డీజే సౌండ్ పెట్టి ఇబ్బంది కల్గిస్తున్నారని 100 డయల్ కాల్ చేశారు. కానిస్టేబుల్ సాయి కిరణ్, హోంగార్డు శివ అక్కడికి వెళ్లి డీజే సౌండ్ బంద్ చేపిస్తుండగా యాదగిరి సాయి చరణ్, చిప్ప పర్తి రాకేష్ పోలీసులతో వాగ్వాదం చేసి విధులకు ఆటంకం కలిగించారు. దాంతో వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.