పండగ పూట ఆ గ్రామంలో దారుణ హత్య..

నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి పండుగ పర్వదినాన దారుణం చోటు చేసుకుంది.

Update: 2025-01-15 02:13 GMT
పండగ పూట ఆ గ్రామంలో దారుణ హత్య..
  • whatsapp icon

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి పండుగ పర్వదినాన దారుణం చోటు చేసుకుంది. బాల్కొండ నియోజకవర్గంలోని మెండోర మండలం బుస్సాపూర్ గ్రామంలో దిలీప్ శర్మ అనే వ్యక్తిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సిమెంటు ఇటుకలతో తలపై మోది దారుణంగా హత్య చేశారు. దిలీప్ శర్మ గత కొన్నేళ్లుగా ఉపాధి కోసం బుస్సాపూర్ కు వచ్చి, గ్రామంలోని ఓ మెడికల్ షాపులో పని చేస్తున్నట్టు గ్రామస్థులు తెలిపారు. దిలీప్ శర్మను హత్య చేసిందెవరనేది అంతుపట్టకుండా ఉందని గ్రామస్థులంటున్నారు.

సంఘటనా స్థలంలో సిమెంటు ఇటుకలు, మధ్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుడికి పరిచయం ఉన్న వ్యక్తులతో మద్యం తాగుతూ ఉండగా జరిగిన గొడవలో హత్య జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకో కోణంలో చూస్తే.. సంఘటనా స్థలం వద్ద మద్యం సీసాలతో పాటు కండోం పాకెట్ దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ హత్య వెనుక మహిళతో అక్రమ సంబంధం ఏదైనా ఉండొచ్చా అనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా పండుగ పూట గ్రామంలో జరిగిన ఈ దారుణ హత్య విషాదాన్ని నింపింది.


Similar News