Breaking news: మన్ననూరు గురుకులంలో ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య..

ఓ విద్యార్థిని క్లాస్ రూంలోనే ఫ్యాన్ కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో చోటు చేసుకొంది.

Update: 2023-03-06 14:08 GMT
Breaking news: మన్ననూరు గురుకులంలో ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య..
  • whatsapp icon

దిశ, అచ్చంపేట: ఓ విద్యార్థిని క్లాస్ రూంలోనే ఫ్యాన్ కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళ్లితే.. అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో గల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాలలో నిఖిత అనే విద్యార్థిని ఏడవ తరగతి చదువుతుంది. కాగా మూడు రోజుల క్రితం తోటి విద్యార్థులతో ఏదో విషయమై మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం పాఠశాల ఉపాధ్యాయులకు తెలపడంతో ఇరువురి విద్యార్థులకు సర్దిచెప్పినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే నిఖిత మానసిక వేదనకు గురైనట్లు తెలుస్తోంది. సోమవారం ఉన్నట్లుండి సాయంత్రం తోటి విద్యార్థులు క్రీడా మైదానంలో ఉన్న సమయంలో ఒంటరిగా నిఖిత తరగతి గదిలోకి వెళ్లి చున్నితో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News