30 మంది ప్రయాణికులతో వెళ్తుండగా బ్రహ్మణి పడవ బోల్తా.. ఏమైందంటే..?

ఒడిశాలోని కేంద్రపరా జిల్లాలోని ఔల్ సమీపంలోని ప్రజలంతా రోడ్డు సౌకర్యం లేక.. రోజు వారీ రవాణా కోసం బ్రహ్మణి నదిలోని పడవ సహాయంతో ప్రయాణిస్తారు.

Update: 2023-04-27 04:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలోని కేంద్రపరా జిల్లాలోని ఔల్ సమీపంలోని ప్రజలంతా రోడ్డు సౌకర్యం లేక.. రోజు వారీ రవాణా కోసం బ్రహ్మణి నదిలోని  పడవ సహాయంతో  ప్రయాణిస్తారు. అయితే తాజాగా ఆ పడవలో ఈ రోజు (గురువారం) ఉదయం 6 గంటలకు 30 మంది ప్రయాణికులు, అలాగే 8 నుంచి 10 బైక్‌లు ఉన్న ఆ పడవ.. ఎకమానియా నుంచి రాజ్‌నగర్‌లోని కేరదాగర్‌కు వెళుతున్న సమయంలో ప్రమాదవశాత్తు.. పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు కనిపించకుండా పోయారు. ప్రస్తుతం ఇరుగు పొరుగు వారు గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలికి చేరుకున్నారు. 

Tags:    

Similar News