Delhi High Court summons BBC:బీబీసీకి ఢిల్లీ హై కోర్టు సమన్లు

ఓ ఎన్జీవో దాఖలు చేసిన పరువు నష్టం దావాపై ఢిల్లీ హై కోర్టు సోమవారం బీబీసీకి సమన్లు జారీ చేసింది.

Update: 2023-05-22 13:01 GMT

న్యూఢిల్లీ: ఓ ఎన్జీవో దాఖలు చేసిన పరువు నష్టం దావాపై ఢిల్లీ హై కోర్టు సోమవారం బీబీసీకి సమన్లు జారీ చేసింది. బీబీసీ తీసిన డాక్యుమెంటరీ నరేంద్ర మోడీ, భారత న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా ఉందని ఆ ఎన్జీవో తన పిటిషన్‌లో పేర్కొన్నారు. బీబీసీ-యూకేతో పాటు బీబీసీ ఇండియాకు కూడా సమన్లు జారీ అయ్యాయి. న్యాయం కోసం గుజరాత్‌కు చెందిన ఎన్జీవో దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాలని కోర్టు కోరింది. బీబీసీ ఇండియా లోకల్ ఆపరేషన్ ఆఫీస్. అయితే బీబీసీ యూకే ఈ డాక్యుమెంటరీని విడుదల చేసింది.

‘ఇండియా ది మోడీ క్వశ్చన్’ అనే ఈ డాక్యుమెంటరీని రెండు ఎపిసోడ్‌లుగా చిత్రించారు. భారతదేశం, న్యాయవ్యవస్థతో సహా మొత్తం వ్యవస్థను ఈ డాక్యుమెంటరీ పరువు తీసినందున బీబీసీకి వ్యతిరేకంగా పరువు నష్టం దావా వేసినట్టు ఎన్జీవో తరఫు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే అన్నారు. అయితే ఈ కేసు తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది.

Read more:

ఆ స్టేషన్లో ఆగకుండా వెళ్లిన ట్రైన్.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాకవడం ఖాయం

Tags:    

Similar News