మార్గదర్శి కేసులో వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు సీజ్
మార్గదర్శి ఛిట్ఫండ్కేసులో ఇప్పటివరకు 1,035 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను సీజ్‌చేసినట్టు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అదనపు డీజీ సంజయ్కుమార్చెప్పారు.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: మార్గదర్శి ఛిట్ఫండ్కేసులో ఇప్పటివరకు 1,035 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను సీజ్‌చేసినట్టు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అదనపు డీజీ సంజయ్కుమార్చెప్పారు. తమపై ఎవ్వరి ఒత్తిడి లేదన్నారు. హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు సంబంధించి ఇప్పటివరకు ఏడు కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ఏడు బృందాలతో ఏడు బ్రాంచీల్లో తనిఖీలు నిర్వహించి నలుగురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. అరెస్టయిన వారిలో ఆడిటర్‌కూడా ఉన్నట్టు చెప్పారు. ఇక, మార్గదర్శి చిట్ఫండ్స్కేసులో రామోజీరావును గతంలో హైదరాబాద్‌లో ప్రశ్నించినట్టు తెలిపారు. సంస్థ ఎండీగా ఉన్న శైలజా కిరణ్‌ను రెండుసార్లు ప్రశ్నించినట్టు చెప్పారు. మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో జరిపిన తనిఖీల్లో కీలక పత్రాలు దొరికినట్టు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరో రెండు రాష్ర్టాల్లో మార్గదర్శి 108 బ్రాంచీలతో వ్యాపారం చేస్తున్నట్టు వివరించారు.
ఒత్తిడి వస్తున్న నేపథ్యంలోనే సీఐడీ విచారణ జరుగుతోందన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. రిజిస్ర్టార్ఆఫ్కంపెనీస్అధికారులను కలిసి అన్ని వివరాలు సేకరించినట్టు తెలిపారు. తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌ను కలిసి అన్ని విషయాలు చెప్పినట్టు పేర్కొన్నారు. ఇక, సంస్థకు చెందిన ఆస్తులను ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం అటాచ్చేసిందని, దీంట్లో కొన్ని ఫిక్స్డ్డిపాజిట్లు, కొన్ని మ్యూచువల్ఫండ్స్ఉన్నాయన్నారు. సంస్థ మూతపడితే ఖాతాదారులకు డబ్బులు వాపసు ఇవ్వాల్సిన బాధ్యత స్టాంప్స్అండ్రిజిస్ర్టేషన్శాఖదే అని చెప్పారు. చిట్ఫండ్యాక్ట్సెక్షన్12 ప్రకారం చిట్ఫండ్వ్యాపారంలో వచ్చిన డబ్బుతో వేరే వ్యాపారాలు చేయటానికి వీల్లేదని తెలిపారు. కంపెనీస్యాక్ట్ప్రకారం తాము అన్ని వివరాలను ఫైల్చేస్తున్నామని శైలజా కిరణ్చెబుతున్నారని అన్నారు. మార్గదర్శి సంస్థ రిజిస్ర్టేషన్అయ్యింది కంపెనీస్యాక్ట్ప్రకారమే అని అంటున్నారన్నారు. అయితే, ఆ తరువాత చిట్ఫండ్స్యాక్ట్అమల్లోకి వచ్చిందని అదనపు డీజీ సంజయ్కుమార్చెప్పారు. ఈ నేపథ్యంలో మార్గదర్శి చిట్ఫండ్స్కూడా ఈ యాక్ట్కిందకే వస్తుందని అన్నారు. అయినా, మార్గదర్శి చిట్ఫండ్స్సంస్థ ఈ చట్టాన్ని పాటించటం లేదని చెప్పారు.
ఈ వ్యాపారంలో వస్తున్న నిధులను వేరే వ్యాపారాలకు మళ్లించినట్టు తెలిపారు. దర్యాప్తు అధికారులు తప్పు చేస్తే పై అధికారులకు ఫిర్యాదు చేయాలిగానీ చేతిలో పత్రిక ఉందని వారి ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా వార్తలు రాస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు సంబంధించిన తొమ్మిది బ్రాంచీల్లో మొత్తం ఇరవై మూడు గ్రూపులను స్టాంప్స్అండ్రిజిస్ర్టేషన్శాఖ పూర్తిగా మాసివేయనున్నట్టు చెప్పారు. ఈ గ్రూపుల్లో ఉన్న సభ్యులందరికీ డబ్బు వాపసు ఇస్తామన్నారు. చిట్రిజిస్ర్టార్అనే వ్యవస్థను వాడుకుని చిట్టీలకు ష్యూరిటీ ఇచ్చిన వారి ఆస్తులను సంస్థ అటాచ్చేస్తోందని చెప్పారు. అలాంటపుడు చిట్ఫండ్యాక్ట్ప్రకారం వివరాలు ఎందుకు నమోదు చేయరని ప్రశ్నించారు. రామోజీరావు వయసుకు గౌరవం ఇచ్చి హైదరాబాద్వచ్చివ విచారణ చేస్తున్నట్టు చెప్పారు. గ్రూపుల్లోని సభ్యులు చిట్టీ పాడుకుంటే డబ్బు ఇవ్వకుండా తమ సంస్థలోనే ఫిక్స్డ్డిపాజిట్లు చేసుకుంటున్నట్టు తెలిపారు. సభ్యుల ఆధార్‌కార్డు, పాన్‌కార్డు నిబంధనలను అస్సలు పాటించటం లేదని చెప్పారు. ఇవన్నీ అన్అకౌంటబుల్ఖాతాలని తెలిపారు. ఈ కేసులో సీఐడీపై ఎవ్వరి ఒత్తడి లేదని అంటూ చట్ట ప్రకారమే విచారణ చేస్తున్నట్టు వివరించారు.