Principal Secretary : ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి తృటిలో తప్పిన ప్రమాదం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసాద్ త్రుటీలో రోడ్డు ప్రమాదం నుండి తప్పించున్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది.

Update: 2024-11-04 06:22 GMT

దిశ, కోదాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసాద్ త్రుటీలో రోడ్డు ప్రమాదం నుండి తప్పించున్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలను పరిశీలిస్తే వాణి ప్రసాద్ హైదరాబాద్ నుండి విజయవాడకు కారులో బయలుదేరారు. మునగాల మండలం ఆకుపాముల వద్ద ముందు వెళుతున్న కారు ను క్రాస్ చేయబోయి ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. కాగా ఆమెకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. సమాచారం తెలుసుకున్న కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రిన్సిపాల్ సెక్రెటరీ వాణి ప్రసాద్ ను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News