మనస్తాపంతో ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

తన కోడలు.. కొడుకుతో సంసారం చేయడం లేదని మనస్తాపంతో ఓ వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గజ్వేల్ మండలం కోడకండ్ల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

Update: 2023-06-07 14:52 GMT
మనస్తాపంతో ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
  • whatsapp icon

దిశ, కొండపాక : తన కోడలు.. కొడుకుతో సంసారం చేయడం లేదని మనస్తాపంతో ఓ వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గజ్వేల్ మండలం కోడకండ్ల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. కుకునూరుపల్లి ఎస్సై పుష్పరాజ్ కథనం మేరకు.. కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొడకండ్ల గ్రామానికి చెందిన పిట్ల యాదగిరి (70) ఇంట్లో గత కొంతకాలంగా తన కొడుకు, కోడలు మధ్య గోడవలు జరగడంతో కోడలు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో ఇంట్లో తండ్రీ, కొడుకులు మాత్రమే ఉంటున్నారు. ఇంట్లో ఆడవాళ్లు లేకుండా కోడలు కాపురానికి రాకపోవడంతో మనస్తాపానికి గురైన యాదగిరి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడాడ్డాచెంది ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. కుకునూరుపల్లి ఎస్ఐ పుష్పరాజ్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Tags:    

Similar News