జిల్లా జనరల్ ఆసుపత్రిలో యువకుడి అత్మహత్యా యత్నం..

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఒక యువకుడు గొంతు కోసుకొని అత్మహత్యయత్నం చేశాడు.

Update: 2023-05-01 15:33 GMT
జిల్లా జనరల్ ఆసుపత్రిలో యువకుడి అత్మహత్యా యత్నం..
  • whatsapp icon

దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఒక యువకుడు గొంతు కోసుకొని అత్మహత్యయత్నం చేశాడు. ఈ సంఘటన సోమవారం మద్యహ్నం జరిగింది. అత్మహత్యయత్నానికి పాల్పడిన యువకుడిని నగరంలోని నిజాం కాలనీకి చెందిన ఖలీం (21) గా గుర్తించారు. సోమవారం మద్యాహ్నం ప్రభుత్వ వైధ్య కళాశాల అనుబంధ జిల్లా జనరల్ ఆసుపత్రిలో సూపరింటేండేంట్ కార్యాలయం ముందు బ్లేడ్ తో గొంతుకోసుకోన్నాడు. అతడిని అక్కడ ఎమర్జేన్సి వార్డుకు తరలించి చికిత్స అందించారు. గతంలోను ఖలీం అత్మహత్య యత్నం, తనను తాను గాయపర్చుకున్నట్లు తెలిసింది. గత కొంత కాలంగా మతిస్థిమితం లేకపోవడంతో ఎర్రగడ్డ మానసిక వైధ్య శాలలో వైధ్య సేవలు పొందినట్లు అతని తల్లి మున్ని తెలిపారు. ఖలీం గతంలో జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ లో పారిశుధ్య కార్మికుడిగా పనిచేసినట్లు కరోనాకు ముందుకు అతడిని విధుల నుంచి తప్పించినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.

ఇటివల కాలంలో అతని తల్లి మున్నిని సైతం స్వీపర్ గా పనిచేస్తుండగా విధులకు రావద్ధని కాంట్రాక్టర్, అధికారులు చెప్పినట్లు బాధితురాలు వాపోయింది. 25 సంవత్సరాలుగా స్వీపర్ గా పనిచేస్తున్న తనతల్లిని విధులకు ఎందుకు రాకుడదని అడిగేందుకు వచ్చిన ఖలీం అధికారులు స్పంధించకపోవడంతో ఆత్మహత్యయత్నం చేయడం గమనార్హం. ఈ విషయం పై జిల్లా ఆసుపత్రి సూపరింటేండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ ను వివరణ కోరేందుకు యత్నించగా సెలవులో ఉండి అందుబాటులో లేకుండా పోయారు. మిగాతా అధికారులు ఎవ్వరు స్పంధించలేదు. ఒక వైపు కార్మీక దినోత్సవ వేడుకలు జరుగుతుండగా కార్మీకులను తొలిగిస్తామని ఏజెన్సి నిర్వహకులు బెదిరింపులకు పాల్పడడం, కార్మికురాలి కొడుకు అత్మహత్నం చేయడం కలకలం రేపింది.

Tags:    

Similar News